ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకు రావడం జరిగింది. మొత్తం 15,004 గ్రామ వార్డ్ సచివాలయాలకు గాను 2.66 లక్షల వాలంటీర్ల ను నియమించడం జరిగింది.
ఈ వాలంటీర్ నియామక ప్రక్రియ ప్రతీజిల్లాలోను జాయింట్ కలెక్టర్ [గ్రామ వార్డ్ సచివాలయ డిపార్ట్మెంట్] వారు ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయవలసి వుంటుంది.
వాలంటీర్ వరుసగా మూడు రోజులు హాజరు కాక పోతే వారి పోస్ట్ ను కాళిగా భావిస్తూ ఏడవ రోజు కొత్తగా వాలంటీర్ ను భర్తీ చేయవలసి వుంటుంది.ప్రతీ వాలంటీర్ వరుస మూడు సచివాలయాల వర్కింగ్ డేస్ లలో కనీసం ఒకరోజు అయినా హాజరు నమోదు [బయోమెట్రిక్] చేసుకోవలసి వుంటుంది అనగా వరుసగా మూడు రోజులు హాజరు కాకపోయినట్లయితే వారిని తొలగించడం జరుగుతుంది.
తేదీ 27.01.2022 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్నటువంటి వాలంటీర్ పోస్ట్ లు 7218.
ఇకనుంచి ఖాళీగా వున్నటువంటి వాలంటీర్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రతీ జిల్లాకి సంబంధించిన గ్రామ వార్డ్ సచివాలయ జాయింట్ కలెక్టర్ వారు ప్రతీ నెలా రెండు విడతల్లో అనగా 1వ తేదీ నాడు మరియు 16వ తేదీ నాడు వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వవలసి వుంటుంది. సంబంధిత ఎంపీడీఓ మరియు మునిసిపల్ కమిషనర్లు ఖాళీల వివరాలు సంబంధిత జాయింట్ కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఇవ్వవలసి ఉంటుంది .గ్రామ వార్డ్ సచివాలయాలకి సంబంధించిన జాయింట్ కలెక్టర్ వారు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయు అధికారం అధికారం కలిగి వున్నారు.
- ముందు ఉన్నటువంటి విధానం ప్రకారమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ROR) అనేది ఉంటుంది.
- ప్రతి కేటగిరి లోనూ 50% రిజర్వేషన్ అనేది మహిళలకు ఉంటుంది.
- ఇకనుంచి మండలం / ULB లను యూనిట్ గా కాకుండా జిల్లాను యూనిట్గా తీసుకుని నియామక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది.
- మండలం / ULB లను యూనిట్గా తీసుకొని నియామక ప్రక్రియ చేస్తున్నప్పుడు సంబంధిత కేటగిరి అభ్యర్థులు లేనందువలన ఆ ప్రక్రియ ఆగిపోకుండా జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆయా కేటగిరీ అభ్యర్థులు లేనప్పుడు మిగిలిన కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ నియామక ప్రక్రియ ఇక జరుగును.
- ముందుగా ఉన్నటువంటి అర్హతలు, అనర్హతలు , విద్యార్హతలు గౌరవ వేతనం, చేయవలసిన పనులు మరియు ఇతర అన్ని విషయాలు ముందుగా ఉన్నటువంటి జీవో ప్రకారమే ఉండును .
Government Order