గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. మెన్స్ కు 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేయగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నిర్వహించిన పేమెంట్ పరీక్షకు 4,04,039 మంది హాజరయ్యారు.
మెయిన్స్ కు 92,250 మందిని ఎంపిక చేయడం జరిగింది.ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
2018లో నిర్వహించిన గ్రూప్-2 ప్రిన్స్ రాసిన వారి నుంచి 1:12 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయగా ఈసారి ఎక్కువ సంఖ్యలో 92,250 మంది అభ్యర్థులకు మెయిన్స్ రాసే ఛాన్స్ లభించింది. గ్రూప్ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం ఇదే మొదటిసారి.
గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి
డిప్యూటీ తాసిల్దార్ – 114 , ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ – 150, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ పోస్ట్లు – 3, గ్రేడ్ 2 సబ్ రిజిస్టర్ – 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ 28, పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏ ఏ ఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి.