అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తూ ఎండైనా, చలైనా, వానైనా, వరదైనా, సెలవైనా, పండగైనా చివరకు కరోనా కష్టాలలో సైతం వెనుదిరగక, వెన్ను చూపక ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న మానవతా మూర్తులైన వాలంటీర్ల సేవలను గుర్తించి అందిస్తున్న చిరు సత్కారం…. – మీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం.. ప్రతి మండలంలో రెండు రోజులు, రాష్ట్రవ్యాప్తంగా 20 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభించనున్న
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మందికి రూ.239.22 కోట్ల నగదు పురస్కారాలు.
గత సంవత్సరం అందించిన రూ. 226.77 కోట్లతో కలిపి రెండేళ్ళలో మొత్తం రూ. 465.99 కోట్ల నగదు పురస్కారాలు..
ఎంపిక విధానం
మూడు అంశాల ఆధారంగా..
సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్ వేవ్ ఫీవర్ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. సేవా వజ్ర అవార్డుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున, సేవా రత్న అవార్డుకు ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్ పది మంది చొప్పున ఎంపిక చేశారు. కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు
లేనివారిని సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేశారు.