పేదలకు భూ పంపిణీ

కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూముల పంపిణీ..9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్/లీజు పట్టాలు..అసైన్మెంట్ చేసి 20 సం|| పూర్తయిన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు..

Rythu bharosa Paymenst Status -CLICK HERE

PM Kisan Paymenst Status -CLICK HERE

 

 

గతంలో 22-A నిషేధిత జాబితాలో చేర్చిన 1,61,584 మంది రైతులకు చెందిన 1,58,113 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనామ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ 22 – A నుండి తొలగింపు…1,563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమి కేటాయింపు..

ల్యాండ్ పర్చేజ్ స్కీం (LPS) క్రింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వ హక్కులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష

వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పతకం ద్వారా అనేకరకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించుట కొరకు భూముల రీ సర్వే చేయడం జరుగుతుంది.రాష్ట్రవ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను రెండు విడతలుగా 4 వేల గ్రామాలు రీసర్వే పూర్తిచేయడం జరిగింది. ఇప్పటివరకు 42.6 లక్షల ఎకరాల్లో రీ సర్వే పూర్తిచేయడం జరిగింది.17.53 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది.

Leave a Comment

Share via