రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ

2021 నవంబర్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు రూ. 542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం క్రింద రూ. 29.51 కోట్ల లబ్ధితో కలిపి మొత్తం రూ. 571.57 కోట్లను నేడు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

రబీలో విత్తనాలు వేసుకొని వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న రైతన్నలకు 80 శాతం రాయితీతో మళ్లీ విత్తుకోవడానికి 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఆరోజే అప్పటికి అప్పుడే సరఫరా చేయడం జరిగింది.

  • 2020 మార్చి వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 1.56 లక్షల మంది రైతన్నలకు రూ.123.70 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ 2020 ఏప్రిల్ లో అందజేత.

  • 2020 ఏప్రిల్ నుండి 2020 అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.71 లక్షల మంది రైతన్నలకు రూ.278.87 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ 2020 అక్టోబర్లో అందజేత.

     

  • 2020 నవంబర్ లో నివర్ సైక్లోన్ వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతన్నలకు రూ.645.99 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ 2020 డిసెంబర్ లో అందజేత.

 

 

  • 2021 సెప్టెంబర్ లో గులాబ్ సైక్లోన్ వల్ల నష్టపోయిన 34,556 మంది రైతన్నలకు రూ.22 కోట్ల సాయం 2021 నవంబర్లో అందజేత..

Leave a Comment

Share via