లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం..
ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే..! అది ఎక్కడైనా, ఏ ఆఫీసులోనైనా..! కలెక్టరేట్ / ఆర్డీవో/ పోలీస్ / సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్/ఎమ్మార్వో కార్యాలయాలు కానివ్వండి.. వాలంటీర్లు, సచివాలయాలుకానివ్వండి.. 104, 108 సేవలు కానివ్వండి.. ఇలా ఎక్కడైనా, ఎవరైనా సరే ప్రభుత్వ సేవలకు లంచం అడిగితే..వెంటనే మీ గళం ఎత్తండి.. “14400 మొబైల్ యాప్“లో ఫిర్యాదు చేయండి..యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ (Click Here) మీద క్లిక్ చేయండి.
14400 మొబైల్ యాప్ లో పిర్యాదు చేసే విధానం
పై లింక్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి “14400 మొబైల్ యాప్” డౌన్లోడ్ చేసుకోవాలి.
- డౌన్లోడ్ చేసుకొన్న తరువాత యాప్ ను ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.. ఎంటర్ చేసిన తరువాత మీ మొబైల్ కు OTP (వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది.
- OTP ని ఎంటర్ చేసిన తరువాత మీకు స్క్రీన్ పై లైవ్ రిపోర్ట్ (ఫోటో/వీడియో/ఆడియో) మరియు లాడ్జ్ కంప్లైంట్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
- లంచం తీసుకునేటప్పుడు లేదా లంచం డిమాండ్ చేసినప్పుడు అప్పటికప్పుడు ఫొటో/వీడియో/ఆడియో తీసి పంపాలనుకుంటే లైవ్ రిపోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. లైవ్ లో రికార్డ్ అయిన ఈ అవినీతి తతంగం, ఆటోమేటిక్ గా తేదీ, సమయం, లొకేషన్ వివరాలతో మీరు సబ్మిట్ బటన్ నొక్కగానే ఏసీబీ కి వెళుతుంది.
- అవినీతి గురించి మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే లాడ్జ్ కంప్లైంట్ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీ దగ్గర అవినీతికి సంబంధించిన ఫోటో/ వీడియో/ఆడియో/డాక్యుమెంట్ సాక్ష్యాలు ఉన్నట్లయితే, సంబంధిత వివరాలతో లాడ్జ్ కంపెంట్ ఆప్షన్ ద్వారా ఆ సాక్ష్యాలను అప్లోడ్ చేయవచ్చు.. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కి ఏసిబి కి పంపించండి..
- మీరు సబ్మిట్ బటన్ నొక్కిన తరువాత మీ ఫిర్యాదుకు ఒక నంబర్ ఇవ్వబడుతుంది. ఆ నంబరుతో మీ ఫిర్యాదుల స్టేటస్ ను మీ ఫోన్ లో My Complaints ఆప్షన్ నందు తెలుసుకోవచ్చు.