Aepds యాప్ లో వాలంటీర్లు Distribution points & Status నమోదు చేయు విధానం

  • రేషన్ పంపిణీ చేసే వాహనాలు (MDU) ప్రతినెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, ఆయా సచివాలయములలో  ఉన్న వాలంటీర్ల పరిధిలోని, ఏరియాలో,  నిత్యాసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది.
  • కావున ప్రతి వాలంటీరు తన పరిధిలోని 10 లేదా 12 ఇండ్లకు ఒక లొకేషన్ చొప్పున, తన ఏరియాలో మొత్తం ఐదు లొకేషన్లు మరియు  తన AEPDS ఆప్ లో కూడా నమోదు చేయాలి.
  • ప్రతి ఏరియాకు వాహనము, ఏ తేదీన వస్తుందో ముందుగానే వలంటీరు వినియోగదారులకు తెలియజేయాలి.
  • ఏ లొకేషన్లో వాహనము ఆగుతుందో కూడా చెప్పాలి. ఆ లొకేషన్లోని 10 లేదా 12 ఇండ్ల వారు, ఆ వాహనం వద్ద నిత్యవసర వస్తువులును కొనుగోలు చేసే  సమయంలో.. వాలంటీర్ కూడా ఉండాలి. 
  • ఈ విధమైన సర్వీసు చేస్తున్నందుకుగాను పౌరసరఫరాల శాఖ వారి నుండి వాలంటీరుకు  నెలకు 750 రూపాయలు పారీతోషికంగా ఇవ్వబడుతుంది.
  • ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో,  జాయింట్ కలెక్టర్ వారు తెలిపియున్నారు . పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు కు ఈ విషయము తెలియజేసి వారి పరిధిలో… అందరికీ అనువైన, ఐదు లొకేషన్ లను గుర్తించి వెంటనే మీకు తెలియజేయవలెను.
  • సదరు లొకేషన్ లను మీరు గూగుల్ షీట్ లో నమోదు చేయవలెను.
  • వాలంటీర్ తన మొబైల్ లోని AEPDSయాప్ లో కూడా ఆ లొకేషన్లను వెంటనే నమోదు చేయవలసి ఉంటుంది.

గ్రామ వార్డు వాలంటీర్లకు గమనిక AEPDS యాప్ కొత్త వర్షన్ అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ అప్డేట్ అయిన యాప్ లో వాలంటీర్లు మరియు ఎండీఎం ఆపరేటర్లు రెండు రకాల ఆప్షన్స్ అయితే నమోదు చేయవలసి ఉంటుంది.( i ) డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ నమోదు ( ii ) డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ నమోదు

డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ నమోదు చేయు విధానం

Distribution points అనగా రేషన్ పంపిణీ జరిగే ప్రాంతాలను నమోదు చేయుట వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎన్ని ప్రాంతాల వద్ద రేషన్ పంపిణీ జరుగును ఆ ప్రాంతాలలో క్యాప్చర్ చేయవలెను. ముందుగా కొత్తగా అప్డేట్ అయినా Aepds యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వాలంటీర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

Aepds యాప్ న్యూ వెర్షన్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు



Click here

యాప్ లో వాలంటీర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది విధంగా image1 లో చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. Distribution points మీద క్లిక్ చేయగా ఈ క్రింది image2 లో చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది.

Day of distribution అనే దగ్గర మీ ప్రాంతాల్లో ఏ రోజున రేషన్ పంపిణీ జరుగుతుందో ఆ రోజులు ఎంచుకోవాలి ఉదాహరణకి ఒకటవ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతుంది వీటిలో మీ క్లస్టర్ పరిధిలో ఏ తేదీన రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుందో ఆ తేదీ ఎంచుకోవాలి. Enter location name దగ్గర ఏ ప్రాంతం వద్ద అయితే రేషన్ తరుకుల పంపిణీ జరుగుతుందో ఆ ప్రాంతం యొక్క లొకేషన్ పేరు ఎంటర్ చేయాలి, enter mobile number దగ్గర ఆ లొకేషన్లో ఎవరైతే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు వారి యొక్క మొబైల్ నెంబర్ నమోదు చేయాలి, ఉదాహరణకు ఆ ప్రాంతంలో నలుగురు లేదా ఐదుగురు రేషన్ సరుకులు తీసుకుంటున్నట్లయితే కేవలం ఒక్కరి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. Capture location మీద క్లిక్ చేయగా ఆ ప్రాంతం యొక్క లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది.Click to add more location మీద క్లిక్ చేసి వాలంటీర్ క్లస్టర్ లో ఉన్నటువంటి పంపిణీ జరిగే లోకేషన్ ప్రాంతాలు నమోదు చేసి చివరగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Distribution status నమోదు చేయు విధానం

డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అనగా రేషన్ పంపిణీ మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతాలలో జరుగుతుందా లేదా నమోదు చేయవలసి ఉంటుంది.యాప్ లాగిన్ అయిన తర్వాత distribution status అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లో నమోదు చేసిన లొకేషన్ అన్ని చూపించడం జరుగుతుంది. రేషన్ పంపిణీ సమయములో ఏ లొకేషన్ లో అయితే పంపిణీ జరుగుతుందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని టేక్ పిక్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో తీసి చివరిగా సబ్మిట్ చేయాలి.

Leave a Comment

Share via