Andhra Pradesh State Government will provide some services for free

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

సర్వీసు ఛార్జీలు లేకుండా అందించే సేవలు

  • ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • మరణ ధ్రువీకరణ పత్రం
  • మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూకొనుగోలు అనంతరం ఆన్లైన్లో నమోదు), మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ (ఆన్లైన్ లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు)
  • వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)
  • ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు
  • ఆధార్ కార్డ్ లో  మొబైల్ నంబర్ అప్డేట్
  • కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ)
  • కొత్త రేషన్ కార్డ్  లేదా రేషన్ కార్డ్  విభజన
  • ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.

Leave a Comment

Share via