AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే వివిధ పథకాలైన పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వీటితోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలకు కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక పెట్టడం జరిగింది. దీనిలోనే భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు(AP Free Gas Cylinder Scheme 2024) పథకానికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను రూపొందించడం ప్రారంభించింది.

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఈ దీపావళి నుంచి అమలు చేయబడుతున్నట్లు తేది 18-09-2024 నాడు జరిగిన మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఈ పథకానికి సంబంధించి ప్రకటన చేశారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కావలసిన డాక్యుమెంట్లు

ఈ పథకానికి సంబంధించి అర్హతలను మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది. కావలసిన డాక్యుమెంట్లు మరియు ఈ పథకం విధి విధానాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అయితే ఏ సంక్షేమ పథకం అయినా వర్తించుటకు ప్రధానంగా ఆధార్ కార్డు జిరాక్స్ , ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్, గ్యాస్ కనెక్షన్ కి ఆధార్ లింక్, రేషన్ కార్డు జిరాక్స్ మొదలగు డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

ప్రధానంగా దీపం పథకానికి అర్హులైన వారికి గుర్తించేందుకు ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తించదని తెలుస్తోంది. మరింత సమాచారం కొరకు అధికారిక ప్రకటన విడుదలవలసి ఉంటుంది.

Andhra Pradesh GD S Result 2024 2nd merit list – Click Here

వరద భాదితులకు సీఎం చంద్రబాబు ఆర్దిక సాయం – ఒక్కో కుటుంబానికి 25,000 రూ.. – Click Here

AP Free Gas Cylinder Scheme 2024

AP Free Gas Cylinder Scheme 2024

Leave a Comment

Share via