ap free sand policy 2024:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది. నేటి నుంచి ఈ ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది దీనికి సంబంధించి ఉత్తర్వులు తో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ 2024 ప్రధాన ఉద్దేశం కులం మతం వర్గం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందించడం కొరకు ఈ ఉచిత ఇసుక పాలసీని 2024 తీసుకురావడం జరిగింది.
పథకం పేరు | ap free sand policy 2024 |
రాస్ట్రం | ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం |
ప్రారంబించేది | ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం |
ప్రారంబించు తేదీ | 08/07/2024 |
వెబ్ సైటు | https://mines.ap.gov.in/ |
Table of Contents
ఉచిత ఇసుక పాలసీ 2024 విధానం లో చెల్లించే నగదు వివరాలు
ఎవరైనా ఇసుక డిపోకు వెళ్లి లారీ ట్రాక్టర్ ఎద్దుల బండి ఇంకా మినీ ఆటో మొదలగు వాటిల్లో ఇసుకను తెచ్చుకోవచ్చు. అయితే ఇసుక తగినందుకు, తిరిగి లారీల్లో లోడ్ చేసి ఇసుక డిపోకు తరలించినందుకు లేబర్ చార్జీలు మరియు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ప్రజలు చెల్లించాలి.
లేబర్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్ చార్జీలతో పాటు సంబంధిత గ్రామాల అవసరాల కోసం నిర్దేశించినటువంటి 88 రూపాయలు ఫీజును దానిపై జిఎస్టిని లబ్ధిదారులే చెల్లించవలసి ఉంటుంది.
ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఇసుక రిచ్ కు, డిపోకు మధ్య ఉండే దూరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏ జిల్లాలో ఎంత ధర ఉంటుంది అనేది ఆ జిల్లా కలెక్టర్లే నిర్ణయించనున్నారు.
ap free sand policy 2024 నగదు చెల్లించు విధి విధానాలు
ఉచిత ఇసుక విధానంలో తవ్వకానికి అయ్యే ఖర్చు మరియు రవాణా, జీఎస్టీ చార్జీలను ఆన్లైన్ లోనే చెల్లించ వలెను. ఇందుకోసం జిల్లా కలెక్టర్, గనుల శాఖా అధికారులకు కలిపి జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి బ్యాంక్ లు క్యూర్ కోడ్ ని జారి చేశాయి. ఆ క్యూర్ కోడ్ లు ఇసుక డిపోలో ఉండనున్నాయి వాటిద్వారా లబ్ధిదారుల నగదు చెల్లించ వచ్చు. ఆన్లైన్ లో నగదు చెల్లించలేని వారు ఆఫ్లైన్ లో నగదు చెల్లించే అవకాశం కూడా కల్పించారు.
కొన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచిన ధరలు
ఎన్టీయార్ జిల్లాల్లో నమ మాత్రం గా విధించిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జిల్లాని బట్టి ఇసుక ధరలు మారుతుంటాయి గమనించగలరు.
స్టాక్ యార్డ్ / డిపో | ధర (టన్నుకు) |
కాంచల | 313 /- రూపాయలు |
మాగల్లు | 228/- రూపాయలు |
కోడవటికల్లు | 252/- రూపాయలు |
అల్లూరుపాడు | 234/- రూపాయలు |
అనుమంచి పల్లి | 313/- రూపాయలు |
పొలం పల్లి | 210/- రూపాయలు |
కీసర | 325/- రూపాయలు |
మొగళూరు | 240/- రూపాయలు |