Table of Contents
Introduction to AP Ration Card Details Check
AP Ration Card అనేది ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన వారికి ఆహార ధాన్యాలు మరియు ఇతర వస్తువులు సబ్సిడీలు అందించేందుకు ఈ రేషన్ కార్డు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ రేషన్ వ్యవస్థను దారిద్రరేఖకు దిగువన ఉన్న వారి జీవన విధానాలను మెరుగుపరచడానికి రేషన్ కార్డ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది.
రేషన్ కార్డు అనేది ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు ఆధారంగా రేషన్ కార్డు రావడం జరుగుతుంది. నిబంధనలకు అనుగుణంగా లేని వారికి రేషన్ కార్డు రాదు. ఈ నిబంధన అనేవి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి, కావున ప్రభుత్వం మారినా లేదా ప్రభుత్వం నిబంధనలు మార్చిన నిబంధనలను ఆధారంగా రేషన్ కార్డులో తొలగించడం లేదా కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది కావున మన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు మన రేషన్ కార్డు యొక్క ఆన్లైన్ స్టేటస్ ఏంటి తెలుసుకునుటకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు.
Methods to Check AP Ration card Details
మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనగా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు యాక్టివ్ లో ఉన్నారా ఇన్ యాక్టీవ్ లో ఉన్నారా తెలుసుకొనుటకు మీ మొబైల్ లోనే చెక్ చేసుకోవచ్చు లేదా మీ సచివాలయానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.
Step-by-Step Guide: How to Check AP Ration Card Details Online
రేషన్ కార్డు లో ఎంతమంది ఉన్నారు, ఆ రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఏంటి తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది
ఇక్కడ RC Number ఉన్న దగ్గర లబ్ధిదారుల రేషన్ కార్డు నంబర్ లేదా రైస్ కార్డు నంబర్ నమోదు చేసి ఎంటర్ చెయ్యగా ఈ క్రింది విధంగా రేషన్ కార్డు డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి.
Understanding the Information Displayed
ఇక్కడ రేషన్ కార్డు దారుల యొక్క జిల్లా, రేషన్ కార్డుదారుల యొక్క మండలం, రేషన్ కార్డుదారుల యొక్క సెక్రటేరియట్, రైస్ కార్డు యొక్క నంబర్ మరియు పాత రేషన్ కార్డు యొక్క నంబర్, ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వారి యొక్క స్టేటస్ అనగా యాక్టివ్ గా ఉన్నారా లేదా ఇన్ యాక్టివ్ గా ఉన్నారా చూపించడం జరుగుతుంది.
How to Correct AP Ration Card Details
రేషన్ కార్డ్ డీటెయిల్స్ పైన చెప్పిన విధంగా స్టేటస్ చూసుకున్నాక అందులో ఏమైనా తప్పులు అనగా ఆ కార్డుదారుల్లోనే పేర్లు తప్పు, ఆ కార్డుదారుల యొక్క వయసు తప్పుగా ఉన్న లేదా వారి యొక్క స్థితి ఇనాక్టివ్ లో ఉన్న ఇలా ఏవైనా కార్డులో తప్పులు ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. రేషన్ కార్డులో కరెక్షన్ ప్రక్రియ సచివాలయం ద్వారా చేయడం జరుగుతుంది ప్రభుత్వం మారిన దృష్ట్యా ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు.
Linking Aadhaar with AP Ration Card
ప్రస్తుతం రేషన్ కార్డుకి ఆధార్ లింక్ అనేది తప్పనిసరి, కావున రేషన్ కార్డులను ప్రతి ఒక్కరికి ఆధార్ లింక్ అనేది ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ లేకపోతే లింక్ చేయించుకోవాలి, ఈ లింక్ చేయు ప్రక్రియ కూడా సచివాలయం ద్వారా చేయడం జరుగుతుంది.
Troubleshooting Common Issues
రేషన్ కార్డు యొక్క స్టేటస్ చూసుకున్నప్పుడు రేషన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ నో డేటా పౌండ్ లేదా ఏ ఇతర కారణాలు చూపించిన, ముందుగా రేషన్ కార్డు లేదా రైస్ కార్డు యొక్క నంబర్ సరి చూసుకోవాలి. రేషన్ కార్డ్ రైస్ కార్డు లేకుండా నంబరు సరైనదే అయినట్లయితే సచివాలయానికి సందర్శించి అ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
AP Ration Card Mobile App
AP Ration Card కి సంబంధించి ప్లేస్టర్ లో కూడా యాప్ ఇవ్వడం జరిగింది.ఈ యాప్ ద్వారా రేషన్ కార్డు లో ఎంత మంది వున్నారు, ఆ రేషన్ కార్డు స్టేటస్ ఏంటి ఇలా వివిధ రకాల సేవలను ఆ యాప్ ద్వారా పొందవచ్చును.
Frequently Asked Questions(FAQs)
What information can I check online?
రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఆ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారు వారి యొక్క స్టేటస్ ఏంటి అనేది AP Ration Card Details Check ద్వారా తెలుసుకోవచ్చు.
What should I do if my details are incorrect or missing?
మీ రేషన్ కార్డు స్టేటస్ చూసుకున్నప్పుడు రేషన్ కార్డులో తప్పులు ఉన్నట్లయితే మీ సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కి సంబంధించిన కరెక్షన్ చేసుకోవచ్చు.
Conclusion
ఈ వెబ్సైట్ ద్వారా రేషన్ కార్డు యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నారు అని భావిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఆఫీషియల్ వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవ్వగలరు.
electricity bill payment online ap without login – Click Here