Ayushman Bharat (PM-JAY) App New Version

Ayushman (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 1.9  వెర్షన్ కు  అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు  ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది..

ఆయుష్మాన్ యాప్ న్యూ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు. 



Click here



Click here

వాలంటీర్ వారీగా అయుష్మాన్ భారత్ కు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసిన రిపోర్ట్ లింక్


Click here

వాలంటీర్లు సర్వే చేయవలసిన కుటుంబ వివరాల లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు


Click here

Aadhar Face App New Version 👇


Click here

వాలంటీర్లు ఆయుష్మాన్ eKYC ను ఎలా తీసుకోవాలి?

❃ 𝐒𝐭𝐞𝐩 1 : వాలంటీర్లు ముందుగా పైన  ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి👇👇

❃ 𝐒𝐭𝐞𝐩 2 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత Select Language వద్ద భాష ను ఎంచుకొని Login పై క్లిక్ చేయాలి. Login As వద్ద Operator అని సెలెక్ట్ చేసి Register Mobile No / User ID వద్ద వాలంటీర్ మొబైల్ నెంబర్ Auth Mode వద్ద Password / Mobile OTP / Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP అయితే ఓటిపి ఎంటర్ చేయాలి లేదా పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి కాప్చ కోడు ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.

❃ 𝐒𝐭𝐞𝐩 3 : వాలంటీర్ యొక్క ఈ కేవైసీ పెండింగ్ ఉన్నట్టయితే ముందుగా ఈకేవైసీను పూర్తి చేసుకోవాలి. దానికిగాను లాగిన్ అయిన వెంటనే Complete eKYC వద్ద Auth Mode వద్ద Aadhaar OTP అని సెలెక్ట్ చేసి 6 అంకెల OTP ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయాలి. Consent చదివి Tick చేసి Allow పై క్లిక్ చేయాలి. eKYC వివరాలు అన్నీ సరిచూసుకొని Proceed పై క్లిక్ చేస్తే eKYC పూర్తి అయినట్టు. ఈ కేవైసీ ముందుగా పూర్తి అయినట్టయితే పై విధంగా చేయనవసరం లేదు.

❃ 𝐒𝐭𝐞𝐩 4 : కార్డుల eKYC చేయుటకు గాను వాలంటీరు లాగిన్ అయిన వెంటనే search beneficiary పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లబ్ధిదారుని రాష్ట్రము, జిల్లా, ఆధార్ నెంబరు వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.

❃ 𝐒𝐭𝐞𝐩 5 : సెర్చ్ వివరాలు అనుగుణంగా లిస్టు చూపిస్తుంది. అందులో లబ్ధిదారుని పేరుపై క్లిక్ చేసి Aadhaar OTP / Finger Print / IRISH Scan / Face Auth ద్వారా eKYC చేయాలి. ఆధారు నెంబరు పక్కన ఉండే Verify ఆప్షన్ పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేసి, లబ్ధిదారుని ఫోటో తీసుకొని, ఈ కేవైసీ వివరాలు సరి చూసుకున్న తరువాత, additional information వివరాలు అనగా ఫోన్ నెంబరు ఉందా లేదా, ఉంటే మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఓటిపి ద్వారా, బంధుత్వము, పిన్ కోడ్, రాష్ట్రము, జిల్లా, గ్రామము లేదా పట్టణము వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

❃ 𝐒𝐭𝐞𝐩 6: సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆమోదం పొందితే “Download Card” ఆప్షన్ ద్వారా కార్డును పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a Comment

Share via