BIE AP Inter 1st Year and Inter 2nd Year Hall Tickets Download Now
మార్చి 15 నుండి జరిగే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేసిన ఇంటర్ బోర్డు
విద్యార్థులే హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను పబ్లిక్ డొమైన్లో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ఇప్పటికే హ్యూమన్ అండ్ ఎథిక్స్ పరీక్షలు రాసిన హాల్ టికెట్ నెంబర్ గానీ, టెన్త్ హాల్ టిక్కెట్ నెంబర్ గానీ హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్ టిక్కెట్ నెంబర్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రకటించారు. ఫొటోలు, సంతకాలు ఇతర సవరణలు అవసరమైన విద్యార్థులు వారి కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని తెలిపారు. హాల్ టిక్కెట్లపై ప్రిన్సిపల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
SSC 10th Class Exams Hall Tickets Downlaod Now