- రేషన్ కార్డు దారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతినెలా డబ్బులు ఇవ్వనుంది.
- మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలుచేస్తారు.
- ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు.
- కిలోకు రూ.12 నుంచి రూ.15 ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.