వరద భాదితులకు సీఎం చంద్రబాబు ఆర్దిక సాయం – ఒక్కో కుటుంబానికి 25,000 రూ..

విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ లోని కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి 25 వేల చొప్పున ఇవ్వనన్నట్లు వెల్లడించారు. మొదటి, ఆపై ఉన్న అంతస్తులోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల పరిహాణాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్క కుటుంబానికి పదివేలు ఇస్తామన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దిళ్లలో నివసిస్తున్నట్లయితే వారికే పరిహారం అందించనున్నారు. ఇంటి యజమాని బీమాను క్లైమ్ చేసుకోవచ్చు. పంట నష్టపరిహారం కూడా కౌలు రైతులకే చెల్లించనున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ కిరాణా దుకాణాలు, హోటల్లు, ఇతరత్రా చిరు వ్యాపారాలు, సూక్ష్మ , మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించారు.

వీటితోపాటు దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫిషింగ్ బోట్లకు పరిహారం ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,72,272 కుటుంబాలను వరద ప్రభావితమైంట్లు గుర్తించారు.

విభాగాల వారీగా ప్రకటించిన పరిహారం

విభాగం ప్రకటించిన పరిహారం
గ్రౌండ్ ఫ్లోర్లో నీట మునిగిన ఇళ్లకు (విజయవాడలో)ఒక్కో కుటుంబానికి రూ. 25 వేలు
మొదటి, ఆపై అంతస్తులోని నేత మునిగిన ఇళ్లకు ( విజయవాడలో)ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు
గ్రౌండ్ ఫ్లోర్ లోని నీట మునిగినీళ్లకు ( రాష్ట్రం లోని ఇతర ప్రాంతాల్లో)ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు
కిరాణా దుకాణాలు, హోటల్లో వంటి చిన్న వ్యాపారాలకు (విజయవాడలోఒక్కో దుకాణానికి రూ. 25 వేలు
రూ.40 లక్షల కంటే తక్కువ టర్న్ హౌర్ కలిగిన ఎంఎస్ఎంఈ లకుఒక్కో ఎస్టాబ్లిష్మెంట్ కు రూ 50 వేలు
రూ.40 లక్షల నుంచి రూ.1.50 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకుఒక్కో ఎస్టాబ్లిష్మెంట్ కు రూ 1 లక్ష
రూ.1.50 కోట్ల కంటే ఎక్కువ టర్న్ అవర్ కల్గిన ఎంఎస్ఇఎం లకుఒక్కో ఎస్టాబ్లిష్మెంట్ కు రూ 1.50 లక్షలు
ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకుఒక్కో దానికి రూ.3 వేలు
ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆటోలకుఒక్కో దానికి రూ. వేలు
దెబ్బతిన్న తోపుడు బండ్లకు ( విజయవాడలో)వాటి స్థానం లో కొత్తవి
చేనేత కార్మికులకుఒక్కో ఇంటికి రూ.25 వేలు
వలఉన్న ఫిషింగ్ బోట్లు (పాక్షికంగా దెబ్బతింటే)ఒక్కో బోటుకు రూ.9 వేలు
వలఉన్న నాన్ మోటరైసేడ్ ఫిషింగ్ బోట్లు (పూర్తిగా దెబ్బ తింటే)ఒక్కో బోటుకు రూ.20 వేలు
వలఉన్న మోటర్ ఐస్ ఫిషింగ్ బోట్లు ( పూర్తిగా దెబ్బతింటే)ఒక్కో బోటుకు రూ.25 వేలు
చేపల చెరువులు ( డీజిల్టేషన్/రిస్టోరేషన్/రిపేర్)హెక్టారుకు రూ.18 వేలు
సెరీకల్చర్హెక్టారుకు రూ.25 వేలు
చనిపోయిన ఆవులు, గేదెలకుఒక్కో దానికి రూ.50 వేలు
చనిపోయిన ఎద్దులకుఒక్కో దానికి రూ.40 వేలు
చనిపోయిన దూడలకుఒక్కో దానికి రూ.25 వేలు
చనిపోయిన గొర్రెలు, మేకలుఒక్కో దానికి రూ.7,
చనిపోయిన కోళ్లు ( పౌల్ట్రీ పరిశ్రమలో)ఒక్కో బర్డ్ కు రూ.100
పశువులు పాకలు ధ్వంసం అయితేఒక్కో పాకకు రూ.5000

పంటనస్ట పరిహార వివరాలు

పత్తి, వేరుశనగ, వరి, చెరుకు తొలి పంటలకు – హెక్టారుకు రూ. 25,000

సజ్జలు, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, జ్యూట్, కొర్రలు, సామలు – హెక్టారుకు రూ. 15 వేలు

తమలపాకు తోటలకు – హెక్టారుకు రూ.75 వేలు

అరటి, పసుపు, కంద, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ, యాపిల్ బేర్, సపోటా, జీడి మామిడి, డ్రాగన్ ఫ్రూట్ తోట లకు – హెక్టారుకు రూ. 35

కూరగాయలు, బొప్పాయి, టమాటా, పువ్వులు, ఉల్లిపాయలు, పుచ్చకాయ తోటలు, నర్సరీలకు – హెక్టారుకు రూ. 25 వేలు

ఆయిల్ ఫామ్, కొబ్బరి చెట్లు – ఒక్కో దానికి రూ. 1500 చొప్పున

Free Sand Scheme: ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయం – Click Here

RRB NTPC Notification 2024: రైల్వే లో 8113 ఉద్యోగాలు, స్టేషన్ మాస్టర్, క్లర్క్ పోస్టులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం – Click Here

Leave a Comment

Share via