Distribution of HCM Two page Letter by Grama Ward Volunteers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాధించిన విజయాలను తెలుపుతూ ఉన్నటువంటి రెండు పేజీలు లేఖను ప్రతి ఒక్క ఇంటికి అందించనుంది.

గ్రామ వార్డు వాలంటీర్ ఈ లెటర్ ను తీసుకొని వారి పరిధిలో గల కుటుంబాలకు అందజేసి బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ లో ekyc చేయవలసి వుంటుంది.

వాలంటీర్లు బెనిఫిషరీ ఔట్రెచ్ యాప్ లో సర్వే చేయు విధానం

కొత్తగా అప్డేట్ అయిన బెనిఫిషరి ఔట్రీచ్ యాప్ ను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.


Click here

క్లస్టర్ వారీగా లెటర్ పంపిణీ చేసిన రిపోస్ట్స్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



Click here

పై లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ HCM Letter Received Status (Final year- Total Benefits) అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యగా వాలంటీర్ క్లస్టర్ లో వున్న కుటుంబ వివరాలు కనిపించడం జరుగును సర్వే చేయడానికి ఒక కుటుంబాన్ని ఎంచుకోగా 4 ప్రశ్నలు చూపించడం జరుగుతుంది వాటిని చదివి విపించి అవును కాదు గుర్తించ వలసి వుంటుంది.

ప్రశ్న1 : జగనన్న ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను రాబోయే ఐదేళ్లు కూడా కొనసాగిస్తుంది. ఇది జగనన్న మాట. మీకు, మీ కుటుంబానికి ఈ పథకాలతో మంచి జరిగిందనుకుంటున్నారా?

ప్రశ్న2 : జగనన్న ప్రభుత్వం మీ ఇంటివద్దకే సేవలందించేందుకు ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు వాలంటీర్లను, సచివాలయాల వ్యవస్థను మున్ముందు కూడా కొనసాగిస్తుంది. ఇది జగనన్న మాట. ఈ వ్యవస్థ వల్ల మీకు మంచి జరిగిందనుకుంటున్నారా?

ప్రశ్న 3 : మన ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న సురక్ష, నాడు నేడు పాఠశాలలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటుంది. ఇది జగనన్న మాట. ఈ కార్యక్రమాలతో మీరు, మీ కుటుంబం ప్రయోజనాలు పొందారా?

ప్రశ్న 4 : జగనన్న నవరత్నాలు, ఇతర అన్ని పథకాలు ఇలాగే కొనసాగేందుకు, జగనన్నకు మద్దతు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

పై నాలుగు ప్రశ్నలు చదివి అవునా కదా ఎంచుకుని క్రింద వున్న HCM Message ను చదివి వినిపించ వలసి వుంటుంది.

HCM Message: మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులతో ఈ ఐదేళ్లు మీ బిడ్డ మీ ఊర్లోనూ మీ ఇంట్లో ఏమి మేలు చేశాడన్నది మీ కళ్లముందే కనిపిస్తోంది. ప్రతీ గ్రామానికి, ప్రతీ పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. (చదివి వినిపించండి)

చివరిగా ఎవరు అయితే ఆ కుటుంబం లో అందుబాటులో వున్నవారిని ఎంచుకుని eKYC చేయవలసి వుంటుంది.

Leave a Comment

Share via