ప్రతీ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో తప్పనిసరిగా ఇ- కర్షక్ (ఈ క్రాప్) కార్యక్రమం లో రైతులు వేసిన పంటలను నమోదు చేసుకోవలెను.
ఈ క్రాప్ నమోదు అయినదా లేదా ఈక్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు
- రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు (ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు మొదలగునవి) ప్రభుత్వం కొనాలన్నా లేదా రైతులు వేసిన పంటల తాలూకా నష్టాలు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మరియు పంటల బీమా పతకము తదితర పథకాలలో లబ్ధి పొందుటకు ఈ క్రాప్ నమోదు తప్పైని సరిగా చేయించుకుని వుండవలెను.
- వ్యవసాయ ప్రణాళిక, ఇన్పుట్స్, రుణ ప్రణాళిక వంటి కార్యక్రమాలకు ఇ- కర్షక్(ఈ క్రాప్) తప్పనిసరిగా నమోదు చేయించుకోవలెను.
E-Crop నమోదుకు కావలసినవి
- ఆధార్ కార్డ్ జెరాక్స్
- పొలం పాస్ బుక్ జెరాక్స్ లేదా పొలం 1B జెరాక్స్
రైతులు పైన తెలిపిన డాక్యుమెంట్స్ తీసుకుని వారి పరిధిలోని గ్రామ సచివాలయం లో వున్న వి.వి.ఎ / వి.హెచ్.ఎ/ వి.ఎస్.ఎ ల సమన్వయం తో E-Crop (పంట నమోదు) నమోదు చేయించుకోవలెను.