గ్రామ వార్డు వాలంటీర్లు ఎడ్యుకేషనల్ సర్వే చేయవలసి ఉంటుంది.ఈ సర్వేను చేయడానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
పై లింకు మీద క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
మొదటిసారి లాగిన్ అవుతున్న వారు యూజర్నేమ్ దగ్గర క్లస్టర్ ఐడి ఎంటర్ చేయాలి పాస్వర్డ్ దగ్గర cu@98765 ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీ క్లస్టర్ ఐడి మరియు మీరు క్రియేట్ చేసుకున్న కొత్త పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది విధంగా ఉండటం జరుగుతుంది.
Select a house hold దగ్గర క్లిక్ చేసిన ఆ క్లస్టర్ లో వున్న మొత్తం కుటుంబ వివరాలు ఓపెన్ అవుతాయి.
మనం ఏ కుటుంబాన్ని సర్వే చేయాలి అనుకుంటున్నామో ఆ కుటుంబాన్ని ఎంచుకోవాలి.
కుటుంబాన్ని ఎంచుకున్నాక మీ కుటుంబంలో ఎంత మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అనే దాని మీద క్లిక్ చేయవలెను. మన ఎంచుకున్న కుటుంబంలోని వారి ఎవరో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకపోయినట్లయితే 0 ఎంచుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
మరొక కుటుంబాన్ని సర్వే చేయడానికి సెలెక్ట్ హౌస్ హోల్డ్ దగ్గర క్లిక్ చేసి ఆ కుటుంబాన్ని ఎంచుకోవాలి.
మనం ఎంచుకున్న కుటుంబంలో ఒకరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నట్లయితే “మీ కుటుంబంలో ఎంతమంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు” అనే దగ్గర 1 ఎంచుకోవలసి ఉంటుంది. ఇలా ఎంచుకోగానే మరికొన్ని డీటెయిల్స్ ఈ క్రింది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
పైన చూపిన వివరాలన్నీ ఎంచుకున్నాక చివరగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చెయ్యాలి. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎడ్యుకేషనల్ సర్వే పూర్తి చేయాలి.