ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈనెల 19 నుంచి అందుబాటులో తెచ్చేందుకు గనుల శాఖ ఏర్పాటు చేస్తుంది. గతంలో ఈ ఉచిత ఇసుక విధానంలో ఇసుకను బుక్ చేసుకొనుటకు సచివాలయం లేదా మీ సేవ సెంటర్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే ఇప్పుడు పునరుద్ధరించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దీని కొరకు ఇప్పటికే ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ మరియు యాప్ ను అధికారులు సిద్ధం చేశారు. వివిధ శాఖలకు చెందిన అన్ని జిల్లాల ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చారు.
ఈ కొత్త ఇసుక బుకింగ్ విధానాన్ని సెప్టెంబర్ 11న ప్రారంభించాల్సి ఉండగా విజయవాడలోని వరద సహాయ కార్యక్రమాల్లో ఘనత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంచాలకులు ప్రవీణ్ కుమార్ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు. ఈనెల 18 న మంత్రి మండల సమావేశం జరగనుంది తర్వాత రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటు
వచ్చే నెల నుంచి నదుల్లోని రీచ్ల్లో తవ్వకాలు మొదలుకాలు ఉన్నాయి. ఉచిత ఇసుక దారి మల్ల కొండ మరియు ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిగా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరే ఇందులోని అధికారులు నియమిస్తారు. గనుల శాఖ, పోలీస్, ఎక్సైజ్, నేటిపారుదల, భూగర్భ జలవనరులు … తదితర శాఖల అధికారులతో కూడిన బృందం విస్తృతంగా తనిఖీలు చేయనుంది.
RRB NTPC Notification 2024: రైల్వే లో 8113 ఉద్యోగాలు, స్టేషన్ మాస్టర్, క్లర్క్ పోస్టులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం – Click Here
NTR Bharosa Pension Transfer Application Form – పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయు విధానం కావలిసిన డాక్యు మెంట్లు – Click Here