How to check ysr bima status
YSR బీమా కుటుంబం లో ఒకరికి మాత్రమే వర్తించును మీ కుటుంబం లో ఎవరికి ఈ వైఎస్ఆర్ బీమా వర్తించునో తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యవలెను.
Click here
బీమా స్టేటస్ చూడటానికి డెమో వీడియో కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.
YSR బీమా స్టేటస్ మూడు విధాలుగా చెక్ చెయ్యవచ్చు
1 రైస్ కార్డ్ నంబర్ ద్వారా
2 ఆధార్ నంబర్ ద్వారా
3 పేరు ద్వారా (జిల్లా,మండలం, సెక్రటేరియట్ ఎంచుకుని)
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అగును.
ఆధార్ నంబర్ ద్వారా బీమా స్టేటస్ చూచుట (Search By Aadhar Number)
ఆధార్ నంబర్ ద్వారా పాలసీ దారుని వివరాలు చూడటానికి Search By Aadhar మీద క్లిక్ చేసి కుటుంబంలో ఎవరికి అయితే పాలసీ చేసున్నారో వారి యొక్క ఆధార్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసినా పాలసీ దారుని వివరాలు వచ్చును.నమోదు చేసిన ఆధార్ నంబర్ కి బీమా పాలసీ నమోదు చేయకపోయినట్లయితే No Details Found అని చూపించడం జరుగుతుంది.
రైస్ కార్డ్ నంబర్ ద్వారా బీమా స్టేటస్( Search By Rice Card Number)
రైస్ కార్డ్ నంబర్ ద్వారా స్టేటస్ చూడటానికి Search By Rice Card దగ్గర క్లిక్ చేసి Enter Rice Card Number దగ్గర రైస్ కార్డ్ నంబర్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన ఆ కుటుంబంలో ఎవరికి బీమా నమోదు చేసి వుంది మరియు నామిని వివరాలు ఈ క్రింది విధంగా వచ్చును.
పేరు ద్వారా బీమా స్టేటస్ (Search By Name)
పేరు ద్వారా స్టేటస్ చూడటానికి Search By Name దగ్గర క్లిక్ చేయవలెను,ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మన జిల్లాను మరియు మండలము మరియు మన సచివాలయం ఎంచుకుని Enter Name దగ్గర పాలసీ దరుని పేరు(ఆధార్ కార్డ్ లో వున్న విధంగా) ను నమోదు చేసి సెర్చ్ చేసిన వివరాలు చూపించడం జరుగుంతుంది.