jagananna animuthyalu awards for Meritorious Govt 10th class and inter students awards and guidelines

jagananna animuthyalu awards for Meritorious Govt 10th class and inter students awards and guidelines

ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుని పదవ తరగతి, ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్) పేరిట ప్రభుత్వం సత్కరించనుంది ఈ అవార్డులను నియోజక వర్గం, జిల్లా మరియూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్నారు.

పదవ తరగతిలో అవార్డులకు ఎంపికైన విద్యార్థుల వివరాలు

నియోజక వర్గ స్థాయిలో మొదటి టాప్ 3 స్థానాలలో ఎంపిక అయిన విద్యార్థుల సంఖ్య – 602 మంది

జిల్లా స్థాయిలో టాప్ 3 స్థానాలలో ఎంపిక అయిన విద్యార్థుల సంఖ్య – 606 మంది

రాష్ట్ర స్థాయిలో టాప్ 3 స్థానాలలో ఎంపిక అయిన విద్యార్థుల సంఖ్య – 38 మంది

ఇంటర్ లో అవార్డులకు ఎంపిక అయిన విద్యార్థుల వివరాలు

ఇంటర్ స్థాయిలో MPC, BiPC, HEC, CEC/MEC గ్రూపులు వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంచి.

నియోజక వర్గ స్థాయిలో టాప్ 1 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య – 750 మంది
జిల్లా స్థాయిలో టాప్ 1 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య – 800 మంది
రాష్ట్ర స్థాయిలో టాప్ 1 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య – 35 మంది

అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి సత్కార సమాచారం

అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో ఈ నెల 25 న సన్మాన వేడుక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజక వర్గం లో అందరికి అనువైన మండల కేంద్రంగా ఈ వేడుక నిర్వహించనున్నారు.

నియోజక వర్గ స్థాయిలో ఎంపిక చేయబడిన పదవ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహ వివరాలు

  • మొదటి బహుమతి. – 15,000/-
  • రెండవ బహుమతి – 10,000/-
  • మూడవ బహుమతి – 5000/

10వ త్రగతి సంబంధించి నియోజక వర్గ స్థాయిలో ఎంపిక చేయబడిన విద్యార్థుల లిస్ట్ కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు


Click here

నియోజక వర్గ స్థాయిలో ఇంటర్మీడియట్ టాపర్లకు 15,000/- రూ. చొప్పున నగదు అందిస్తారు.

జిల్లా స్థాయి సత్కార సమాచారం

జిల్లా స్థాయిలో టాపర్లుగా ఎంపిక చేయబడిన 10వ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 27న జిల్లా కేంద్రాల్లో సన్మానిస్తారు.

జెడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్, ఎపి మోడల్, బిసీ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, కేజీబీవీ..(ప్రభుత్వ, జెడ్పీ, మునిసిపల్ పాటశాలలు ఒకే మేనేజ్ మెంట్) ఒక్కో మేనేజ్ మెంట్ లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన విద్యార్థులను సన్మానిస్థారు.

జిల్లా స్థాయిలో ఎంపిక చేయబడిన పదవ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహ వివరాలు

మొదటి స్థానం – 50,000/-
రెండవ స్థానం – 30,000/-
మూడవ స్థానం – 15,000/-

10వ తరగతి సంబంధించి జిల్లా స్థాయిలో ఎంపిక చేయబడిన విద్యార్థుల లిస్ట్ కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.


Click here

ఇంటర్ లో గ్రూపునకు ఒక్కక్కరు చొప్పున టాపర్లకు ఒక్కొక్కరికి 50,000/- అందిస్తారు

రాష్ట్ర స్థాయి సత్కార సమాచారం

రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయబడిన ఈ నెల 31 న విజయవాడలో నిర్వహిస్తారు. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న వివిధ మేనేజ్మెంట్ స్కూల్లలో చదివి అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి సత్కారాలకు ఎంపిక చేయబడ్డాయి.

రాష్ట్రస్థాయిలో ఎంపిక చేయబడిన పదవ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహ వివరాలు

  • మొదటి స్థానం – లక్ష రూ.
  • రెండవ స్థానం – 75,000/-
  • మూడవ స్థానం – 50,000/-

రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయబడిన పదవ తరగతి విద్యార్థుల లిస్ట్ కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.


Click here

ఇంటర్ లో గ్రూపుకు ఒక్కరూ చొప్పున నాగు గ్రూపుల లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి రూ. లక్ష చొప్పున అందిస్తారు.

Leave a Comment

Share via