Jagananna Vidya kanuka 2022-23

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో….. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా నేడే కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ…

విద్యా కానుక కిట్ లో అందించనున్నవి

  • ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఒక పేజీలో ఇంగ్లీష్, మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు).
  • నోట్బుక్లు.
  • వర్క్ బుక్లు.
  • 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టుకూలితో సహా.
  • ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు.
  • బెల్టు.
  • స్కూలు బ్యాగు.
  • ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ.

బాలికల డ్రాపౌట్ రేట్ను తగ్గించాలన్న లక్ష్యంతో… రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జగనన్న విద్యా దీవెన పాఠశాలలు మరియు కళాశాలల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికి పైగా విద్యార్థినులకు జగనన్న విద్యా కానుక “స్వేచ్ఛ” ద్వారా ఏటా రూ.32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్ కిన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్న జగనన్న ప్రభుత్వం… మనబడి “నాడు-నేడు” ద్వారా విద్యాసంస్థల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం కూడా..

     జగనన్న ప్రభుత్వం విద్యా రంగంలో ప్రవేశ పెట్టిన విప్లవాత్మక చర్యల వల్ల 2018-19 సం॥ లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10 వ తరగతి వరకు 37.21 లక్షలు గా ఉన్న విద్యార్థుల సంఖ్య 7 లక్షలకు పైగా పెరిగి 2021-22 నాటికి 44.30 లక్షలకు చేరింది.. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరింది..

చదువులు మెరుగుపరుస్తూ, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, ప్రపంచస్థాయిలో పోటీపడేలా మన పిల్లలను సన్నద్ధం చేసేందుకు దేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ‘ ఒప్పందం.. ఏటా రూ. 24 వేల వరకు ఖర్చుతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న ఈ స్టడీ మెటీరియల్ ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉచితంగా అందించబోతున్న మన జగనన్న ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి లో చేరబోతున్న 4.7 లక్షల మంది విద్యార్థులకు రూ. 500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికి దాదాపు రూ.12,000 విలువ చేసే ట్యాబ్లు ఉచితంగా ఈ సెప్టెంబర్లోనే.. ఇకపై ప్రతి ఏటా 8వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ఉచితంగా ట్యాబ్లు అందజేయనున్న ప్రభుత్వం..

రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు బోధించే దిశగా ప్రతి క్లాస్ రూములో టీవీ లేదా డిజిటల్ డిస్ప్లే బోర్డులు కూడా ఏర్పాటు దిశగా అడుగులు.

Leave a Comment

Share via