JVD కి జాయింట్ అకౌంట్ ఏ విద్యార్థులు ఓపెన్ చేయాలి
- 2022-23 వ విద్యా సంవత్సరానికి సంబంధించి చివర ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఏ క్యాస్ట్ వారైనా కూడా ఈ అకౌంట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.
- SC కులానికి చెందిన విద్యార్థులు వారు ఏ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ జాయింట్ అకౌంట్ అవసరం లేదు.
- మిగిలిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
JVD eKYC Dashboard – Click Here
JVD Payment Status – Click Here
జాయింట్ అకౌంట్ ఎవరితో ఓపెన్ చేయాలి
జాయింట్ అకౌంట్ వారి తల్లితో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తల్లి మరణించినట్లయితే తండ్రి లేదా సంరక్షణకు నీతో ఈ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు
- విద్యార్థి మరియు తల్లి యొక్క 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- విద్యార్థి మరియు తల్లి/సంరక్షకుని ఆధార్ కార్డుల జెరాక్స్ లు
- విద్యార్థికి సంబంధించిన కాలేజీ ఐడి కార్డు
- విద్యార్థి పదవ తరగతి సంబంధించిన మార్కు లిస్టు జిరాక్స్
జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి
జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాక జాయింట్ అకౌంట్ యొక్క ముందు పేజీ జిరాక్స్ ని మరియు విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డులు జిరాక్స్ లను వారి సచివాలయంలోని WEA/WEDPS లకు అందించాలి.
ఈ జాయింట్ అకౌంట్ ఎప్పటిలోగా ఓపెన్ చేయాలి
జాయింట్ అకౌంట్ నవంబర్ 24వ తేదీ లోపల ఓపెన్ చేసి పైన తెలిపిన డాక్యుమెంట్స్ తో సచివాలయంలో అందించవలెను.