Mission Vatsalya Scheme | mission Vatsalya Scheme pdf, Application form, launch date

Mission Vatsalya Scheme | mission Vatsalya Scheme pdf, Application form, launch date

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి ?

ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

Mission Vatsalya Scheme

Click here

మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?

స్పాన్సర్ షిప్ కార్యక్రమము మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ తెలిపిన అర్హతలు కలిగిన 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులు

1️⃣. వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు

2️⃣. అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసినివసిస్తున్న అనాధ బాలలు

3️⃣. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలు

4️⃣. ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు

5️⃣. బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం. రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/ వేదింపులకు/ దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.

6⃣ PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు

7⃣. తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.

8⃣. పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.

9⃣. తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు

🔟. బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).

1⃣1⃣. కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.

మిషన్ వాత్సల్య పథకానికి ధరకాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు

1. బాలుడు లేదా బాలిక జనన(Birth) ధృవీకరణ పత్రం
2. బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డ్ జిరాక్స్
3. తల్లి ఆధార్ వార్డ్ జిరాక్స్
4. తండ్రి ఆధార్ కార్డ్ జిరాక్స్
5. తండ్రి ఆధార్ కార్డ్ జిరాక్స్
6. తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రం జిరాక్స్, మరణ కారణం
7. గార్డియన్ ఆధార్ కార్డ్ జిరాక్స్
8. రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ జిరాక్స్
9. కుల ధృవీకరణ పత్రం జిరాక్స్
10. బాలుడు లేదా బాలిక పాస్ ఫోటో
11. స్టడీ సర్టిఫికేట్
12. ఆదాయ (Income) ధ్రువీకరణ పత్రం జిరాక్స్
13. బాలుడు లేదు బాలిక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకునితో కలసిన జాయింట్ అకౌంట్.

మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటి ?

● స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్థిక సహాయం నిలుపుదల చేయబడుతుంది.

● పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు)

● ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.

● ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.

● తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.

● పిల్లల స్టడీ certificate ఈ సంవత్సరం అనగా 2022- 2023 మాత్రమే సమర్పించండి.

మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ ఆర్ధిక పరిమితి ఏంటి ?

1️⃣. రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.

2️⃣. ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కి అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదు.

మిషన్ వాత్సల్య’ నిధుల కేటాయింపు ఎలా?

ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ. 2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్స హాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.

Mission Vatsalya Scheme PDF

Click here

Ap MLC Graduate Voter Registration

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో అవకాశం కలదు. గతం లో…

Read More


Leave a Comment

Share via