nethanna nestham 2023 | eligibilty | Status Check | guidelines | payment status
నేతన్న నేస్తం 2023 ముఖ్య తేదీలు
- తేదీ 20/06/2023 వరకూ గతం లో అప్లై చెయ్యకుండా వున్నవారు అప్లై చేసుకోవచ్చును.
- తేదీ 21/06/2023 నుంచి 23/06/2023 వరకూ కొత్తగా అప్లై చేసిన వారికీ మరియూ పాత వారికి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగును.
- తేదీ 28/06/2023 నుంచి 29/06/2023 మధ్యలో తాత్కాలిక అర్హులు/అనర్హుల జాబితా సచివాలయం లో ప్రదర్శించడం జరుగుతుంది.
- తేదీ 30/06/2023 నుంచి 05/06/2023 వరకూ తాత్కాలిక అర్హుల జాబితాలో అనర్హులు అయిన వారు గ్రీవియన్స్ పెట్టుకోవచ్చు.
- తేదీ 06/07/2023 నుంచి 07/07/2023 మధ్యలో తుది(ఫైనల్) అర్హుల జాబిత విడుదల అగును.
పథకం ముఖ్య ఉద్దేశం
చేనేత కార్మికుల స్థితి గతులను మెరుగుపరిచి వారి జీవన ప్రమాణాలను పెంపొందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అపూర్వ పథకానికి శ్రీకారం చుట్టింది.
ప్రయోజనాలు
మగ్గం ఉన్న ప్రతీ చేనేత కుటుంబానికి గాను రూ 24,000/- లు ప్రోత్సాహం గా అందించటం ద్వారా తమ మగ్గాలను ఆధునీకరించుకుని మర మగ్గాలతో పోటీ పడేందుకు ఉపకరిస్తుంది.
గమనిక: EBC నేస్తం అర్హత గల లబ్ధిదారులకు ఆధార్ కి లింక్ అయిన బాంక్ అకౌంట్ కి మాత్రమే నగదు జమ అగును.ఆధార్ కి బ్యాంక్ లింక్ లెట్లయితే నగదు జమ అవ్వదు.
ఆధార్ కి బ్యాంక్ లింక్ అయినదా? లేదా ? ఏ బ్యాంక్ లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.ఏ బ్యాంక్ లింక్ లేని వారు మీ బ్యాంక్ కు వెళ్లి NPCI లింక్ చేయించుకివచ్చును.
ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI) లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరు
చేనేత పథకం వర్తింపునకు కావలసిన అర్హతలు.
1. సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబం మాత్రమే అర్హులు.
2. ఒక చేనేత కుటుంబములో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నప్పటికీ ఒక లబ్ధి దారునికి మాత్రమే ఇవ్వబడుతుంది.
3. లబ్ధిదారునుకి OAP (వృద్ధాప్య పెన్షన్) వస్తున్నట్లయితే వారు అనర్హులు.
4. లబ్ధిదారునికి రైతు భరోసా వస్తున్నట్లయితే వారు నేతన్న నేస్తానికి అనర్హులు.
లబ్ధిదారునికి రైతు భరోసా వస్తుందా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేసి రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చూడగలరు.
5. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000/- రూ. లోపు ఉండాలి మరియు పట్టణ ప్రాంతాలలో (BPL) నెలకు 12,000/- రూ. లోపు ఉండాలి.
6. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ దారుడు కాకూడదు.
7. కుటుంబ నివాస యూనిట్ యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం (సొంత/అద్దె) సగటున 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
6 నెలల విద్యుత్ యూనిట్ల సరాసరి కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.
8.కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించబడ్డాయి).
9. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.చెల్లించే వారు అనర్హులు
10. మునిష్పల్ ఏరియాలో 1000 sq.ft స్థలం కంటే తక్కువ వుండాలి.
11. అర్హత గల లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మపింగ్ నందు వుండవలెను.
మీ కుటుంబానికి సంబంధించి House Hold Mapping నందు ఎవరెవరు వున్నారు అనే అంశాలు చెక్ చెయ్యడానికి ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యవలెను.