సంక్షేమ పథకాలు అర్హత కలిగి ఏకారణం చేతనైనా లబ్ధి పొందని వారి దరఖాస్తులు వెరిఫై చేసి డిసెంబర్ 28 2021 న అర్హత గల లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది.
వివిధ పథకాల (చేయూత, అసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన,కాపు నేస్తం, వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, పెన్షన్ కానుక) ద్వారా ఇప్పటివరకు 7,36,770 మంది లబ్ధి దారులను గుర్తించడం జరిగింది.
వీరిలో 6,45,900 మందికి పేమెంట్ సక్సెస్ అయినది.
23,555 మంది లబ్ధి దారులకు పేమెంట్ ఫెయిల్ అయినది.
67,315 మంది లబ్ధి దారులకు పేమెంట్ అండర్ ప్రొసెస్ లో వున్నది.
సచివాలయాల వారీగా Payment Fail (or) Payment Under process లో వున్న వారి Report కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
Click here
పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా గా ఓపెన్ అవడం జరుగుతుంది.
ఇక్కడ ముందుగా మన జిల్లాను ఎంచుకోవాలి తారుత మండల జాబితా చూపించడం జరుగుతుంది.మన మండలాన్ని ఎంచుకున్న తరువాత సచివాలయాల జాబితా చూపించడం జరుగుతుంది మన సచివాలయాన్ని ఎంచుకోవాలి.
గమనిక :- ఇక్కడ సచివాలయాల వారీగా ఎంత మందికి పేమెంట్ ఫెయిల్ అయినది, ఎంత మంది పేమెంట్ సక్సెస్ అయినది, ఎంత మందికి పేమెంట్ అండర్ ప్రొసెస్ లో వుంది చూడవచ్చు.