అమ్మఒడి సంబంధించి ఇంకా డబ్బులు పడని వారు ఈ క్రింది నాలుగు స్టెప్పులు ఫాలో అవ్వగలరు.
స్టెప్ 1: అమ్మఒడి డబ్బులు పడని వారు ముందుగా వారికి అమ్మఒడి సంబంధించిన eKYC పూర్తి అయినద లేదా తెలుసుకోవాలి. అమ్మఒడి EKYC చెయ్యాలన్న లేదా EKYC పూర్తి అయినద లేదా తెలుసుకోవలన్నా మీ యొక్క వాలంటీర్ లేదా WEA ని సంప్రదించి EKYC స్థితిని తెలుసుకోగలరు, EKYC పూర్తి కాక పోయినట్లయితే వారిద్వారానే EKYC చేయించుకోవచ్చును.
అమ్మఒడి eKYC వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎంతమందికి పూర్తి చేశారు ఇంకా ఎంతమందికి పూర్తి చేయాలి రిపోర్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
అమ్మఒడి EKYC చేయు యాప్ (BOP యాప్ న్యూ వెర్షన్) కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
స్టెప్ 2: అమ్మఒడి పథకానికి అర్హులు అయి వుంది వారికి ఇంకా నగదు పడక పోయినట్లయితే ముందుగా తల్లీ లేదా సంరక్షకుని ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయిందో తెలుసుకుని ఆ బ్యాంక్ బ్యాలన్స్ లేదా మిని స్టేట్మెంట్ చూసుకుని అమ్మఒడి పడిందా లేదా నిర్ధారించుకోవాలి.
ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయిందో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు.
స్టెప్ 3: అమ్మఒడి డబ్బులు పడనివారు మీ యొక్క అమ్మఒడి పేమెంట్ స్టేటస్ చూసుకుని రిమార్క్ ఏమన్నా చూపిస్తున్నాయ లేదా చూసుకోవాలి.
అమ్మఒడి పేమెంట్ స్టేటస్ అనేది తల్లి లేదా సంరక్షకుని ఆధార్ నంబర్ ద్వారా మీయొక్క మొబైల్ లో లేదా మీ యొక్క సచివాలయం లో చెక్ చేసుకోవచ్చు.
అమ్మఒడి పేమెంట్ స్టాటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
స్టెప్ 4: అమ్మఒడి పేమెంట్ స్టేటస్ చూసుకున్నాక అందులో చూపించిన రిమార్క్ ఆధారం గా లేదా ఎటువంటి రీసన్ చూపించక పోయినా మీ సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా గ్రీవియన్స్ రైజ్ చేయించుకోగలరు.
ఇలా గ్రీవియన్స్ రైజ్ చేసినవి సరిచూసి అర్హులు అయిన వారికి వారం లో ఒకరోజు పేమెంట్ రీ ప్రాసెస్ చేయడం జరుగుతుంది.