వాలంటీర్ పనితనాన్ని తెలుసుకోవడానికి వాలంటీర్ రేటింగ్ సిస్టమ్ ను రూపొందించడం జరిగింది.
వాలంటీర్ పనితనాన్ని తెలుసుకోవడం కొరకు వాలంటీర్ పరిధిలోని కుటుంబం లోని వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(GOVT) దగ్గరనుంచి “Dear Citizen-మీ వాలంటీర్ యొక్క పనితనాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ప్రభుత్వానికితెలుపగలరు ,XXXXXXX-GOVTAP”అని మెసేజ్ రావడం జరుగుతుంది.
ఆ లింక్ మీద క్లిక్ చేసిన వారి పరిధికి సంబంధించిన వాలంటీర్ వివరాలు అయిన పేరు, వాలంటీర్ సచివాలయం, వాలంటీర్ మండలం మరియు వాలంటీర్ జిల్లా కనిపించడం జరుగుతుంది.
తరువాత వాలంటీర్ పనితనానికి సంబంధించిన మూడు ప్రశ్నలు అడగటం జరుగుతుంది అవి.
- మీ వాలంటీర్ ప్రభుత్వ పథకాలు/
సేవలపై (Government Schemes/Services) పరిజ్ఞానం కలిగి ఉన్నారా? అవును/ కాదు - మీ వాలంటీర్ తరచుగా మీ ఇంటి వద్దకి వచ్చి ప్రభుత్వ పథకాల గురించి వివరంగా తెలియచేయడం జరుగుతుందా? అవును /కాదు
- మీ వాలంటీర్ పనితీరు పట్ల మీరు సంతృప్తి చెందుతున్నారా? అవును/కాదు
పైన చూపించిన మూడు ప్రశ్నలకు వారికి తగిన సమాధానం ని ఎంచుకొని చివరగా Submit బటన్ మీద క్లిక్ చేసిన మీ వాలంటీర్ పనితనాన్ని తెలిపినందుకు ధన్యవాదములు అని ఈ క్రింది విధంగా చూపడం జరుగుతుంది.
ఆ లింక్ అనేది కేవలం ఒకరికి ఒకసారి మాత్రమే ఓపెన్ అవడం జరుగుతుంది. ఒకసారి డేటాను సబ్మిట్ చేసిన లింక్ మీద మరలా క్లిక్ చేసిన మీ వాలంటీర్ పనితనాన్ని తెలిపి వున్నారు అని ఈ క్రింది విధంగా చూపడం జరుగుతుంది.