YSR Aarogya Sri card survey process in volunteer app

డా|| వైయస్సార్ ఆరోగ్య శ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ .25 లక్షలకు పెంపు, మరియూ మెరుగైన స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచి లా పనిచేసే ఆరోగ్యశ్రీ ఆప్ ను ప్రతి ఒక్క ఫోన్లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం. ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలు అన్నిటిని వివరంగా ప్రతి ఇంట్లోనూ వివరించే కార్యక్రమాన్ని నాంది పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వాలంటీర్ల వారీగా రిపోర్ట్ కొరకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయగలరు.



Click here

వాలంటీర్ యాప్ లో వాలంటీర్లు సర్వే చేయు విధానం

ముందుగా అప్డేట్ అయిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవలెను


Click here

పై లింకు మీద క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వాలంటీర్ యొక్క సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి నీ నమోదు చేసి లాగిన్ అవ్వవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

ఇక్కడ ఆరోగ్యశ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, క్లస్టర్ లో ఉన్న డేటా ఆధారంగా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా లేదా ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చేసేందుకు ఆప్షన్ కలదు.

సర్వే చేయడానికి ఒక కుటుంబం మీద క్లిక్ చేయగా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు ని ఈ కుటుంబానికి అందించారా? అనే ప్రశ్న చూపించడం జరుగుతుంది. వారికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినట్లయితే ఎస్ అని క్లిక్ చేసి ఆ కుటుంబంలో ఎవరో ఒకరి చేత ఈ కేవైసీ చేయించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సర్వే చేయాల్సి ఉంటుంది.

Leave a Comment

Share via