ysr bima 2023-24 Survey Process and Guidelines | ysr bima app new version
వాలంటీర్ లాగిన్ నందు పాలసీ దారిని యొక్క OTP,థంబ్ తో పని లేకుండా సర్వే చేసేందుకు అవకాశం కలదు
YSR బీమా సర్వే చేయు విదానం డెమో వీడియో
https://youtu.be/b9UbAsY9hd0
2022 – 23 సంll సంబంధించిన YSR బీమా స్టేటస్ కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.
వైయస్సార్ బీమా 2023-24 సంవత్సరానికి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లు సర్వే చేయు విధానము :
Step 1 : ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ వారు YSR BIMA RENWAL APP డౌన్లోడ్ చేసుకోవలెను. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. మొబైల్ అప్లికేషన్ ఎప్పటికీ అప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కావున పైలింక్ ఉపయోగించి అప్డేట్ అయినటువంటి మొబైల్ అప్లికేషన్లను మరలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Note : అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసే సమయం లొ “This APK file might contain unsafe content. Make sure you trust the sender before you open and install it” అని వస్తే అప్పుడు Open పై క్లిక్ చేయాలి. Do you want to install this app? అని వస్తే అప్పుడు Instal పై క్లిక్ చేయాలి. Unsafe app blocked అని వస్తే అప్పుడు More Details పై క్లిక్ చేయాలి. తరువాత Install anyway అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత అన్ని పర్మిషన్ లు ఇవ్వాలి.
Step 2 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పేజీలో వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి టిక్ చేసి Biometric / Irish / FACE ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి.
Note : వాలంటీర్ వారు అందుబాటులో లేకపోతే సచివాలయ ఉద్యోగి తన యొక్క ఆధార నెంబర్తో అప్లికేషన్లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది.
Step 3 : లాగిన్ అయిన తరువాత Home పేజీలో Renewal పై క్లిక్ చేయాలి. అప్పుడు పాలసీదారుని పేరు, రైస్ కార్డు నెంబరు వివరాలు చూపిస్తాయి.
Step 4 : Renewal List లొ రైస్ కార్డు నెంబర్ పై క్లిక్ చేసిన తరువాత “ఎంచుకున్నా పాలసీదారుని వివరాలు” చూపిస్తుంది. అందులో ఉండే వివరాలు
రైస్ కార్డు నెంబరు
పాలసీదారుని ఆధార్ నెంబరు, పాలసీదారిని పేరు
పాలసీదారిని స్టేటస్
whether policy holder is a bread Earner or not ? అంటే పైన చూపిస్తున్న పాలసీదారుడు వారి కుటుంబంలో ముఖ్యంగా సంపాదించే వ్యక్తి నా కాదా అని అర్థము. ఆ కుటుంబము వారిపై ఆధారపడి బ్రతుకుతుందా లేదా అని అర్థం వస్తుంది. తరువాత పాలసీదారుని ఆధార నెంబర్ ఎంటర్ చేసి Consent పై టిక్ చేసి eKYC తీసుకోవాలి. eKYC ను బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP ద్వారా చేయువచ్చు.
Step 5 : eKYC పూర్తి అయిన తరువాత మిగిలిన వివరాలు చూపిస్తుంది అనగా
రైస్ కార్డు నెంబరు,
పాలసీదారుని ఆధార్ నెంబరు,
పాలసీదారుని పేరు,
పాలసీదారుని తండ్రి లేదా భర్త పేరు, పాలసీదారుని Date Of Birth (DD/MM/YYYY), పాలసీదారుని లింగము,
పాలసీదారుని కులము,
పాలసీదారిని ఉపకులము,
పాలసీదారుని వృత్తి,
పాలసీదారిని వృత్తి రకము,
జిల్లా, మండలము, గ్రామ సచివాలయం, పాలసీదారుని వివరాములలో పాలుసీదారును వృత్తి Building And Other Construction Workers అని సెలెక్ట్ చేసుకుంటే Whether Enrolled In Building And Other Construction Workers Board? అనే ప్రశ్న చూపిస్తుంది. అంటే సంపాదించే వ్యక్తి బిల్డింగు మరియు ఇతర సముదాయాల మేస్త్రి / వర్కర్ అయితే వారు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని అర్థము. రిజిస్ట్రేషన్ చేసుకుంటే YES అని చేసుకోకపోతే NO అని సెలెక్ట్ చేయాలి.
Step 6 :పై వివరాలు అన్నీ కూడా సరి అయినవి అయితే అవును అని సెలెక్ట్ చేయాలి సరిగా లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. సరి అయినవి అయితే అవును సెలెక్ట్ చేసి Continue పై క్లిక్ చేయాలి. సరి అయినవి కాకపోతే కాదు అని సెలెక్ట్ చేసి వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. తరువాత Continue పై క్లిక్ చేయాలి.
Step 7 : తరువాతి సెక్షన్లో నామిని యొక్క వివరాలు చూపిస్తాయి. అనగా
నామిని ఆధార, నామిని పేరు, నామిని Date Of Birth (DD/MM/YYYY), నామిని లింగము, నామిని సంబంధం, నామిని మొబైల్ నెంబర్, నామిని కులము, నామిని ఉపకులము, నామిని వృత్తి, నామిని వృత్తి రకము, నామిని వివరాములలో వృత్తి Building And Other Construction Workers అని సెలెక్ట్ చేసుకుంటే Whether Enrolled In Building And Other Construction Workers Board? అనే ప్రశ్న చూపిస్తుంది. అంటే సంపాదించే వ్యక్తి బిల్డింగు మరియు ఇతర సముదాయాల మేస్త్రి / వర్కర్ అయితే వారు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని అర్థము. రిజిస్ట్రేషన్ చేసుకుంటే YES అని చేసుకోకపోతే NO అని సెలెక్ట్ చేయాలి.
తరువాత నామిని బ్యాంకు వివరాలు చూపిస్తాయి. అనగా బ్యాంకు పేరు
బ్యాంకు బ్రాంచ్, బ్యాంకు IFSC కోడ్, అకౌంట్ నెంబరు
నామిని వివరాలు మార్చాలి అనుకుంటే “నామిని యొక్క డీటెయిల్స్ ని మార్చుకోవాలి అనుకుంటున్నారా?” అనే ప్రశ్నలో అవును సెలెక్ట్ చేసి మార్పులు చేయాలి. లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. పై వివరాలు అన్నీ కూడా సరి అయినవి అయితే నామినీకు సంబంధించి eKYC ను తీసుకోవాలి. eKYC కొరకు బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP లొ ఏ ఒక్కటి ఉన్నా eKYC పూర్తి అవుతుంది. తరువాత Continue పై క్లిక్ చేయాలి.
Step 8 : వివరాలు అన్నీ సబ్మిట్ చేసిన తరువాత చివరగా వాలంటీర్ వారి Authentication అడిగగుతుంది. వాలంటీర్ వారు బయోమెట్రిక్ వేసిన తరువాత Data Saved Successfully అనే సందేశం వస్తుంది.
Step 9 : పాలసీదారని వివరములలో “పాలసీదారునికి సంబంధించి పై వివరాలన్నీ సరి అయినవవా ?” లొ అవును / కాదు అనే ఆప్షన్లు ఉంటాయి. కాదు అని సెలెక్ట్ చేస్తే ” పై వివరాలు అన్నీ సరైనవి కాదు కాబట్టి మరలా సర్వే చేయాలనుకుంటున్నారా ?” అని చూపిస్తుంది. అక్కడ కాదు అని సెలెక్ట్ చేస్తే తరువాత స్క్రీన్ కు తీసుకువెళ్తుంది. అదే అవును అని సెలెక్ట్ చేస్తే మరలా కుటుంబంలోని వ్యక్తుల అందరి పేర్లు రైస్ కార్డు ప్రాప్తికి చూపిస్తుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తిలో ఎవరైతే కుటుంబ పెద్దగా ఉండాలి అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసి eKYC తీసుకోవాలి. మరలా ముందు వచ్చిన వివరాలు అన్నీ కూడా చూపిస్తాయి సరి అయినవి అయితే అవును అని కాకపోతే కాదు అని సెలెక్ట్ చేసి మార్చుకొని మరల సబ్మిట్ చేయాలి.
Step 10 : “నామిని అందుబాటులో ఉన్నారా?” అనే ప్రశ్నలో అవును అని ఆప్షన్ క్లిక్ చేస్తే నామిని ఆధార నెంబర్ ఎంటర్ చేసి నామిని సంబంధం ఎంచుకొని నామిని eKYC చేయాలి. eKYC పూర్తి అయిన తర్వాత పైన తెలిపిన వివరాలన్నీ కూడా చూపిస్తాయి సరి అయినవి అయితే అవును అని కాకపోతే కాదు అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి తరువాత వాలంటీర్ వారి బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేయాలి. అదే “నామిని అందుబాటులో ఉన్నారా?” కు కాదు అని సెలెక్ట్ చేస్తే నామిని వివరాలు మరియు నామిని బ్యాంకు వివరాలు వస్తాయి. అన్నీ సరి చూసుకున్న తరువాత వాలంటీర్ బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేయాలి.
Step 11 : పాలసీదారుని స్టేటస్ లో ఎలిజిబుల్ అంటే అర్హులు అయితే Wheather policy holder is Bread Earner or not ? అనే ప్రశ్నలో అవును లేదా కాదు ఆప్షన్లు కనిపిస్తాయి, కాదు అయితే వారికి న్యూ ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా నమోదు చేయవలసి ఉంటుంది. దాని కొరకు హోం పేజీలో Enrolment అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నమోదు పూర్తి చేయాలి.