Ysr Bima new version 1.06 app download

YSR BIMA ENROLLMENT/ RENEWAL / SURVEY APP

Ysr Bima new app (1.06Version) Download

1. పై లింక్ ద్వారా Ysr Bima 1.06.app (భీమా యాప్) ను డౌన్లోడ్ చేసుకోవాలి

2. వాలంటీర్ భీమా యాప్ డౌన్లోడ్ చేసుకొన్న తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ కొరకు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు

ఏమైనా సాంకేతిక సమస్యల కొరకు 7731987582, 7731987581, 9505394510

[email protected] కి కూడా మెయిల్ చెయ్యవచ్చు

3. గ్రామ/వార్డ్ సచివాలయం మ్యాప్ ఐన వాలంటీర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత GETOTP మీద క్లిక్ చెయ్యాలి

OTP ఎంటర్ చేసి ok చెయ్యాలి. మీరు ఎంటర్ చేసిన OTP మ్యాచ్ అయితే మీకు హోం స్క్రీన్ కనపడుతుంది

గ్రామ/వార్డ్ సచివాలయం మ్యాప్ చెయ్యకుండా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్త మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది

4. OTP మ్యాచ్ అయ్యి తర్వాత మీకు హోం స్క్రీన్ లో వై.యస్.ఆర్ భీమా నమోదు మీద క్లిక్ చెయ్యండి. అందులో గ్రీన్, అరెంజే, రెడ్ కలర్ లో మీకు డేటా కనపడుతుంది

గ్రీన్ కలర్ :- సర్వే చేసి నమోదు అయిన వారి డేటా

iఅరెంజే కలర్:- సర్వే చేసి నమోదు కానీ వారి డేటా

రెడ్ కలర్ :- సర్వే కానివారి డేటా

5. గ్రీన్ కలర్ :- సర్వే చేసి నమోదు అయిన వారి డేటా సరి చేసి సేవ్ చేయుట

• గ్రీన్ కలర్ లో ఉన్న పాలసీ హోల్డర్ రైస్ కార్డు నెంబర్ మీద క్లిక్ చేసి వారి యొక్క అదార్ నెంబర్ ఎంటర్ చేసి Ekyc చెయ్యాలి

• PMJJBY కి అర్హత అవును/కాదు

• PMJJBY లోనమోదు అవును/కాదు

• PMJJBY లో నమోదు చేసిన తేది చూసుకోవాలి

• పైన వివరములు సరిచూసి సరిచేసాను అని ఒక draw బాక్స్ లో tick చెయ్యాలి

ఆ తర్వాత PMSBY డేటా కనపడుతుంది. అందులో కూడా PMSBY లో అర్హత అవును/కాదు

PMSBY లోనమోదు అవును/కాదు, PMSBY లో నమోదు చేసిన తేది చూసుకోవాలి

• PMJJBY & PMSBY నమోదు అయిన డేటా సరిచూసి తర్వాత వారి యొక్క బ్యాంకు వివరాలు కనపడుతాయి

బ్యాంకు వివరాలు అనగా బ్యాంకు పేరు, ఖాతా నెంబర్, బ్రాంచ్ పేరు చెక్ చేసి వారి యొక్క వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నవని అంగీకరింఛి సేవ్ చెయ్యాలి

• నామినీ వివరాలు అనగా నామినీ పేరు, నామినీ అదార్, నామినీ పుట్టిన తేది, నామినీ gender, పాలసీదారుని తో గల సంబంధం చెక్ చేసి వారి యొక్క వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నవని అంగీకరింఛి సేవ్ చెయ్యాలి.

ఒకవేళ నామినీ మైనర్ (18సంవత్సరాలు) అయినచో, సంరక్షకుడు వివరాలు కూడా ఎంటర్ చెయ్యవలసి ఉంటుంది

• డేటా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసి డేటా సేవ్ చెయ్యవలెను.

6. అరెంజే కలర్ :- సర్వే చేసి నమోదు కానీ డేటా సరి చేసి సేవ్ చేయుట

• PMJJBY లోనమోదు అవును/కాదు
• అరెంజే కలర్ లో ఉన్న వారు సర్వే చేసి నమోదు కానీ వారు కాబట్టి నమోదు కాలేదు అని చూపబడుతుంది

• ఈ సభ్యుని నమోదు చేయ్యడానికి PMJJBY దరఖాస్తు ఫారము నింపి చివరికి ఆప్లోడ్ చెయ్యాలి

• ఒకవేళ వీరు నమోదు అయితే వారి వివరాలు గ్రీన్ కలర్ ఉన్న వారి డేటా ఏవిధముగా ఎంటర్ చేసారో అదేవిధముగా డేటా సేవ్ చెయవలసి ఉంటుంది

7. రెడ్ కలర్ :- సర్వే కానివారి సర్వే చేయుట
• రెడ్ కలర్ లిస్టు లో రైస్ కార్డు కలిగి సర్వే కానీ వారి డేటా వారు అసలు అందుబాటులో ఉన్నారా/లేదా, వారికీ భీమా నమోదు పై ఆసక్తి ఉన్నారా/లేదా అను విషయము తెలుపవలెను.అందుకుగాను “ Member Available” అను ఆప్షన్ లో YES (ఆసక్తి ఉన్నారు), NO (ఆసక్తి లేదు) అని క్లిక్ చెయ్యాలి.
• భీమా నందు ఆసక్తి ఉన్నవారికి Ekyc చెయ్యాలి. మీరు ఎంచుకున్న రైస్ కార్డు కి సంబంధించి కుటుంబ సభ్యుల జాబితాలో నుండి ఒకరిని ఎంచుకోవాలి. ఆయన కుటుంబ పెద్ద అనగా కుటుంబాన్ని పోసించే వ్యక్తి అయ్యి ఉండాలి

3 thoughts on “Ysr Bima new version 1.06 app download”

Leave a Comment

Share via