ysr cheyutha scheme 2023

YSR చేయూత 2023 అప్డేట్

YSR చేయూత పథకం 2023 సంవత్సరానికి సంబంధించిన నగదు 2024 జనవరి 10,నుంచి జనవరి 20 వ తేదీ మద్య జమకానున్నాయి. 

 

YSR చేయూత అప్లికేషన్ స్టేటస్  కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.



Click here



Click here

గనుక:- గతంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఇప్పుడు కొత్తగా అప్లై చేయాల్సిన పనిలేదు.

వయస్సు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండి SC,ST,OBC మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు.

YSR చేయూత పథకం అర్హతలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది SC,ST,OBC, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళ వయస్సు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డు మరియు రైస్ కార్డ్ కలిగి ఉండవలెను.
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండవలెను.
  • కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే పదివేలు మరియు పట్టణ ప్రాంతాల వారికైతే 12000 మించి ఉండరాదు.
  • కుటుంబ మొత్తానికి మూడు ఎకరాల మాగాన్ని లేదా 10 ఎకరాల మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండరాదు.
  • ఆ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులై ఉండరాదు మరియు ప్రభుత్వం పెన్షన్ను పొందరాదు (YSR పెన్షన్ కానుక కాకుండా)
  • కుటుంబం యొక్క కరెంటు మీటర్ వినియోగం 6 నెలల సరాసరి 3 యూనిట్లు మంచరాదు.
  • లబ్ధిదారునికి పట్టణ ప్రాంతంలో ఇంటి స్థలం 750 చదరపు గజాల మించి ఉండరాదు.
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయపన్ను చెల్లించకూడదు.
  • కుటుంబంలో ఎవరూ కూడా నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉండరాదు.

వైయస్సార్ చేయూతకి అప్లై చేసుకొనుటకు కావలసిన డాక్యుమెంట్లు

1. అప్లికేషన్ ఫామ్
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ
3. Caste Certificate (AP SEVA)
4. inCome Certificate (AP SEVA)
5. బ్యాంకు పాస్ బుక్.
6. OTP Authentication | Bio eKYC | iris Authentication
7. రైస్ కార్డు.

వైయస్సార్ చేతకి గతంలో లబ్ధి పొందే వారికి ఇప్పుడు రెన్యువల్ కొరకు కావలసిన డాక్యుమెంట్లు

ఆధార్ కార్డు జిరాక్స్
రైస్ కార్డ్ జిరాక్స్
క్యాస్ట్ సర్టిఫికెట్ (ఏపీ సేవ పోర్టల్)
ఇన్కమ్ సర్టిఫికెట్ (ఏపీ సేవ పోర్టల్)

YSR చేయూత పథకానికి అప్లై చేయు విధానం

YSR చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకొనుటకు అవకాశం కలదు.
YSR చేయూత పథకానికి అర్హులైన వారు పైన తెలిపిన ధ్రువపత్రాల జిరాక్స్ లతో మీ వాలంటీర్ ద్వారా సచివాలయంలో అప్లై చేసుకోగలరు.

Leave a Comment

Share via