YSR PENSION KANUKA NEW UPDATE 2024 May

*  మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్దాలకు నేరుగా నగదు రూపంలో కాకుండా టీబీటీ విధానంలో వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*   ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం విధానంలో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛన్ డబ్బు జమచేస్తుంది. 

*  విభిన్న దివ్యాంగుల లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్ చైర్ కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ వీరుల వృద్ధ వితంతువుల మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ డబ్బు ఇస్తారు.

*  రాష్ట్రవ్యాప్తంగా 65, 49, 864 మంది పెన్షన్ లబ్ధిదారులు వున్నారు.

*  48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పెన్షన్ డబ్బును ఆధార్ నెంబర్ తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంక్ ఖాతాలోనే జమవుతాయి.

*  లబ్ధిదారులకు ఒకటో తేదీనే డిబిటి విధానంలో డబ్బులు జమ చేయగానే బ్యాంకు నుంచి ఆ సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.

*  రాష్ట్రవ్యాప్తంగా 16,57,361 మంది (25.30 ) తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పెన్షన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్ చేరుకు పరిమితమైన వారు వున్నారు. వీరికి మే ఒకటో తేదీనే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరగనుంది.

*  ఎవరికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఎవరికి ఇంటి వద్ద పంపిణీ చేస్తారనే వివరాల జాబితాను  గ్రామ వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచడం జరిగింది మీ సచివాలయాన్ని సంప్రదించగలరు.

మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయగలరు.

Leave a Comment

Share via