Ysr Pension Transfer
ఒక పెన్షన్ ని ఒక సచివాలయం నుంచి రాష్ట్రంలోని ఏ సచివాలయానికి అయినా ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం YSR PENSION APP లో వెల్ఫేర్ లాగిన్ నందు కలదు.
YSR PENSION ను ఒక సచివాలయం నుంచి మరొక సచివాలయంకు ట్రాన్స్ఫర్ చేయు విధానం.
YSR PENSION APP నందు వెల్ఫేర్ లాగిన్ అయిన తరువాత Pension Info Updated అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపించడం జరుగుతుంది.
ఇక్కడ Transfer/mig-port అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను, అక్కడ వాలంటీర్ లాగిన్ నందు గల పెన్షన్ జాబితా కిపించడం జరుగుతుంది.ఎవరి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నామో వారి వివరాల దగ్గర UPDATE అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను.ఇక్కడ Information (Request raised till 20th of this month in this screen will be processed for Transfer/Portability in coming 1st of pensions payment ) అని ఒక పాపప్ రావడం జరుగుతుంది Ok చేయాలి. Please Select Type of Update [Transfer, Migration,Opt Portable, Changes Address, Mobile Number Update] ఇలా ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది.
ఇప్పుడు మనము పెన్షన్ ను ఒక సచివాలయం నుంచి మరొక సచివాలయం కు ట్రాన్స్ఫర్ చేసుకొనుటకు Transfer అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను. information [ By choosing this option Pensioner will be Migrated permanently to other secretariat] అనే ఒక పాపప్ రావడం జరుగుతుంది Ok చేయాలి. ఇప్పుడు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి వివరాలు ఎంచుకోవలసి వుంటుంది.ముందుగా ఏ సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సచివాలయం ఏ జిల్లాకు చెందినదో ఆ జిల్లాను ఎంచుకోవాలి, తరువాత ఆ సచివాలయం ఏ మండలానికి చెందినదో ఆ మండలాన్ని ఎంచుకోవాలి, చివరిగా ట్రాన్స్ఫర్ చేయాలనుకునే సచివాలయాన్ని ఎంచుకుని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన Deta Saved Successfully అని పాపప్ రావడం జరుగుతుంది.
గమనిక :- ఈ ప్రక్రియ 20వ తేదీ లోపల చేసిన వచ్చేనెల 1వ తేదీకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
పైన తెలిపిన పద్ధతుల ద్వారానే Migration, Opt Portability, Changes Address, Mobile Number Update వంటివి చేయవచ్చు.