కొత్తగా అప్లై చేసిన పెన్షన్ స్టేటస్ ను మీ మొబైల్ లోనే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా పెన్షన్ యొక్క స్టేటస్ ను చూడవచ్చు.
YSR పెన్షన్ స్టేటస్ కొరకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
Click here
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
పెన్షన్ స్టేటస్ అనేది రెండు విధాలుగా చూడవచ్చు.
1. పెన్షన్ అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ద్వారా పెన్షన్ స్టేటస్ చూడవచ్చును.
2. లబ్ధిదారుల ఆధార్ నెంబర్ ద్వారా పెన్షన్ స్టేటస్ ను చూడవచ్చును.
ఎక్కువ మంది దగ్గర సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఉండక పోవచ్చు లేదా తెలియకపోవచ్చు కావున ఆధార్ నంబర్ తో స్టేటస్ ఎలా చూడాలో చూద్దాము.
లబ్ధిదారుల ఆధార్ నంబరు ను పైన గుర్తించిన Enter Your Aadhar Number దగ్గర నమోదు చేసి పక్కన వున్న 🔍 సెర్చ్ బటన్ మీద క్లిక్ చెయ్యగా కాప్ట్చా నమోదు కొరకు ఒక బాక్స్ ఓపెన్ అవడం జరుగుతుంది చూపించిన కాప్ట్చ నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా సచివాలయం లో అప్లై చేసిన సర్వీస్ లు వాటి స్టేటస్ ఈ క్రింది విధంగా కనిపించడం జరుగును.
ఇక్కడ పెన్షన్ స్టేటస్ చూడాలనుకున్నము కావున పెన్షన్ స్టేటస్ అనేది అప్రూవ్ అయినది. ఒకవేళ పెండింగ్ లో వున్నట్లయితే ఆ అప్లికేషన్ నంబర్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఎప్పుడు అప్లై చేశారు ఎవరు ఎప్పుడు అప్రూవ్ చేశారు పెండింగ్ లో వున్నట్లయితే ఎవరి లాగిన్ లో పెండింగ్ వుంది ఈ క్రింది విధము ఓపెన్ అగును.